కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్

ఎ) స్థిర వ్యయాలు బి) చర వ్యయాలు సి) మొత్తం వ్యయాలు డి) ఏదీకాదు
జ: (బి)
2. అమ్మకాలు రూ.2,00,000; స్థిర వ్యయం రూ.40,000; లాభం రూ.50,000 అయితే చర వ్యయం ఎంత?
ఎ) రూ.1,50,000 బి) రూ.1,60,000 సి) రూ.1,10,000 డి) 1,00,000
జ: (సి)
3. అమ్మకాలు రూ.1,00,000; చర వ్యయం రూ.70,000; లాభం రూ.10,000; స్థిర వ్యయం రూ.20,000 అయితే రూ.40,000 లాభాన్ని సంపాదించడానికి అమ్మకాల పరిమాణం ఎంత?
ఎ) రూ.2,00,000 బి) రూ.1,50,000 సి) రూ.1,40,000 డి) ఏదీకాదు
జ: (ఎ)
4. బ్రేక్-ఈవెన్ పాయింట్ (బీఈపీ)ను మరో విధంగా ఏమని పిలుస్తారు?
ఎ) క్రిటికల్ పాయింట్ బి) సమతౌల్య స్థితి సి) లాభనష్టాలు లేని స్థితి డి) పైవన్నీ
జ: (డి)
5. ఒక సంస్థకు చెందిన అమ్మకాలు రూ.60,000; చర వ్యయం రూ.30,000; స్థిర వ్యయం రూ.15,000 అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలు ఎంత?
ఎ) రూ.15,000 బి) రూ.30,000 సి) రూ.20,000 డి) ఏదీకాదు
జ: (బి)
6. ఒక కంపెనీకి సంబంధించిన అమ్మకాలు రూ.3,00,000; చర వ్యయాలు రూ.2,40,000; స్థిర వ్యయాలు రూ.30,000 అయితే రక్షణ అవధి ఎంత?
ఎ) రూ.1,70,000 బి) రూ.1,30,000 సి) రూ.1,50,000 డి) రూ.2,00,000
జ: (సి)
7. బ్రేక్-ఈవెన్ చార్టులో బ్రేక్ ఈవెన్ పాయింటు అమ్మకాల రేఖకు, మొత్తం వ్యయాల రేఖకు మధ్య ఉండే కోణాన్ని ఏమని పిలుస్తారు?
ఎ) రక్షణావధి కోణం బి) పతన కోణం సి) మొత్తం వ్యయ కోణం డి) ఏదీకాదు
జ: (బి)
8. భవిష్యత్తులోని కార్యక్రమాలను పరిమాణ రూపం, ద్రవ్య రూపంలోనూ కొలిచే సాధనాన్ని ఏమంటారు?
ఎ) బడ్జెట్ బి) అంచనా వేయడం సి) నియంత్రణ డి) పైవన్నీ
జ: (ఎ)
9. శూన్యాధార బడ్జెటింగ్ (Zero Based Budgeting)ను మొదటిసారిగా అమెరికాలో ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
ఎ) 1952 బి) 1962 సి) 1972 డి) 1982
జ: (బి)
10. శూన్యాధార బడ్జెటింగ్‌ను మొదట ఉపయోగించిన మాజీ అమెరికా అధ్యక్షుడు ఎవరు?
ఎ) జార్జ్ బుష్ బి) బిల్ క్లింటన్ సి) జిమ్మీ కార్టర్ డి) ఎవరుకాదు
జ: (సి)
11. సంస్థ మొత్తానికి సంబంధించి సమైక్యపరిచిన, సమగ్ర, ఆర్థికపరమైన ప్రణాళిక చర్యను ఏమంటారు?
ఎ) మాస్టర్ బడ్జెట్ బి) శూన్యాధార బడ్జెట్ సి) రోలింగ్ బడ్జెట్ డి) ఏదీకాదు
జ: (ఎ)
12. ఆర్థిక నివేదికలను విశ్లేషించి, వ్యాఖ్యానించడానికి ఉపయోగపడే పద్ధతి ఏది?
ఎ) తులనాత్మక నివేదిక బి) ప్రవృత్తి విశ్లేషణ సి) నిష్పత్తి విశ్లేషణ డి) పైవన్నీ
జ: (డి)
13. బహుళ దృక్పథంలో 'ఫండ్స్' అంటే అర్థం ఏమిటి?
ఎ) నగదు బి) చర మూలధనం సి) మెటీరియల్, నగదు, యంత్రాలు, ఫర్నిచర్ డి) పైవన్నీ
జ: (బి)
14. అకౌంటింగ్ ప్రమాణం (AS) -3 ప్రకారం నగదు ప్రవాహ ప్రవృత్తి నివేదికలో ఒక నిర్ణీత కాలానికి వచ్చిన నగదును కింది ఏ రకంగా చూపాలి?
ఎ) కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహం బి) పెట్టుబడి వ్యవహారాల నుంచి నగదు ప్రవాహం సి) ఆర్థిక కార్యకలాపాల నుంచి నగదు ప్రవాహం డి) పైవన్నీ
జ: (డి)
15. నిధుల ప్రవాహ (స్రవంతి) నివేదిక కింది ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది?
ఎ) నగదు సిద్ధాంతం బి) రాబడి సిద్ధాంతం సి) మిశ్రమ సిద్ధాంతం డి) పైవన్నీ
జ: (బి)
16. నగదు ప్రవాహ నివేదిక కింది ఏ రకమైన ప్రణాళికలను తయారు చేయడానికి సహాయపడుతుంది?
ఎ) స్వల్పకాలిక బి) దీర్ఘకాలిక సి) మధ్యంతర డి) అన్నీ
జ: (ఎ)
17. ఆర్థిక నివేదికలోని అంశాలు, అంశాల గ్రూపుల మధ్య ఉండే సంబంధాన్ని నిర్ణయించి తెలియజేసే విధానాన్ని ఏమంటారు?
ఎ) ప్రవృత్తి విశ్లేషణ బి) నిష్పత్తి విశ్లేషణ సి) నగదు ప్రవాహ విశ్లేషణ డి) ఏదీకాదు
జ: (బి)
18. అకౌంటింగ్ నిష్పత్తులను కిందివాటిలో ఏవిధంగా పేర్కొనవచ్చు?
ఎ) రేటు బి) శాతం సి) నిష్పత్తి డి) అన్నీ
జ: (డి)
19. కిందివాటిని జతపరచి సరైన సమాధానం గుర్తించండి.
1) లాభదాయకత నిష్పత్తి - ఎ) ఫైనాన్షియల్ లివరేజ్
2) కవరేజ్ నిష్పత్తి - బి) ప్రస్తుత నిష్పత్తి
3) టర్నోవర్ నిష్పత్తి - సి) ఆపరేటింగ్ నిష్పత్తి
4) ఆర్థిక నిష్పత్తి - డి) స్టాక్ టర్నోవర్ నిష్పత్తి
5) లివరేజ్ నిష్పత్తి - ఇ) స్థిర డివిడెండు కవరేజ్
ఎ) 1-సి, 2-ఇ, 3-బి, 4-డి, 5-ఎ బి) 1-సి, 2-ఇ, 3-డి, 4-బి, 5-ఎ సి) 1-ఇ, 2-సి, 3-ఎ, 4-డి, 5-బి డి) ఏదీకాదు
జ: (బి)
20. కింది ఏ నిష్పత్తిని 'ఆమ్ల పరీక్ష నిష్పత్తి' అని కూడా పిలుస్తారు?
ఎ) ద్రవ్యత్వ నిష్పత్తి బి) ప్రస్తుత నిష్పత్తి సి) పరమ ద్రవ్యత్వ నిష్పత్తి డి) అన్నీ
జ: (ఎ)
21. ఒక సంస్థ అమ్మకాలు రూ.5,00,000; అమ్మిన వస్తువుల వ్యయం రూ.3,00,000; ఆపరేటింగ్ వ్యయాలు రూ.1,20,000; ఆపరేటింగ్ లాభం రూ.80,000 అయితే ఆపరేటింగ్ నిష్పత్తి ఎంత?
ఎ) 24% బి) 34% సి) 84% డి) 54%
జ: (సి)
22. ఒక సంస్థకు సంబంధించిన అమ్మకాలు రూ.8,00,000; అమ్మిన వస్తువుల వ్యయం రూ.5,50,000; సగటు ఇన్వెంటరీ రూ.1,35,000; అరువు కొనుగోళ్లు రూ.3,60,000 అయితే స్టాక్ టర్నోవర్ నిష్పత్తి ఎంత?
ఎ) 4.07 టైమ్స్ బి) 3.07 టైమ్స్ సి) 5.26 టైమ్స్ డి) ఏదీకాదు
జ: (ఎ)
23. ఒక కంపెనీ ఈక్విటీ వాటా మూలధనం రూ. 10,00,000; 6% ఆధిక్యపు వాటా మూలధనం రూ.4,00,000; సాధారణ రిజర్వు రూ.2,00,000; లాభనష్టాల ఖాతా రూ.4,00,000; 12% డిబెంచర్లు రూ.5,00,000; రుణదాతలు రూ.80,000 అయితే అప్పు-ఈక్విటీ నిష్పత్తి ఎంత?
ఎ) 15 : 1 బి) 25 : 1 సి) 30 : 1 డి) ఏదీకాదు
జ: (బి)
24. కిందివాటిలో దేన్ని 'ట్రేడింగ్ ఆన్ ఈక్విటీ' అని కూడా అంటారు?
ఎ) ఫైనాన్షియల్ లివరేజ్ బి) ప్రస్తుత నిష్పత్తి సి) ఆపరేటింగ్ నిష్పత్తి డి) అన్నీ
జ: (ఎ)
25. కిందివాటిలో ద్రవ్యత్వ నిష్పత్తిని లెక్కించేటప్పుడు ద్రవ్యత్వపు ఆస్తిగా పరిగణించని ఆస్తి ఏది?
ఎ) నగదు బి) ఇన్వెంటరీ సి) బ్యాంకులో నగదు డి) ఏదీకాదు
జ: (బి)
26. 'వ్యయ నియంత్రణ, లాభదాయకత నిర్ధారణకు... వ్యయ ఆడిట్‌కు ఉపయోగించే కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్ సూత్రాలు, పద్ధతులు, విధానాలను అనువర్తింపజేసే శాస్త్రం, కళ'ను ఏమంటారు?
ఎ) కాస్టింగ్ బి) కాస్ట్ అకౌంటెన్సీ సి) కాస్ట్ అకౌంటింగ్ డి) పైవన్నీ
జ: (బి)
27. కిందివాటిలో కాస్ట్ అకౌంటెన్సీ పరిధిలోకి రాని అంశం ఏమిటి?
ఎ) వ్యయాలను కనుక్కోవడం బి) కాస్ట్ అకౌంటింగ్ సి) మొత్తం సంస్థ లాభనష్టాలను లెక్కించడం డి) వ్యయ నియంత్రణ
జ: (సి)
28. కిందివాటిలో శ్రేష్ఠమైన కాస్టింగ్ పద్ధతి లక్షణం ఏది?
ఎ) సాధారణత్వం బి) సరళత్వం సి) పోలిక డి) పైవన్నీ
జ: (డి)
29. కిందివాటిలో నిర్దిష్ట ఆర్డర్ కాస్టింగ్ పద్ధతి కానిది ఏది?
ఎ) యూనిట్ లేదా అవుట్‌పుట్ కాస్టింగ్ బి) జాబ్ కాస్టింగ్ సి) బ్యాచ్ కాస్టింగ్ డి) కాంట్రాక్ట్ కాస్టింగ్
జ: (ఎ)
30. మోటారు వాహనాలను తయారుచేసే సంస్థల్లో ఉపయోగించే కాస్టింగ్ పద్ధతి ఏది?
ఎ) ప్రాసెస్ కాస్టింగ్ బి) బహుళ కాస్టింగ్ సి) కాంట్రాక్ట్ కాస్టింగ్ డి) ఏదీకాదు
జ: (బి)
31. మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ ఉద్దేశం ఏమిటి?
ఎ) ప్రణాళికలను తయారుచేయడం బి) ఆర్థిక సమాచారాన్ని వివరించడం సి) నిర్వహణకు ఉపయోగపడటం డి) పైవన్నీ
జ: (డి)
32. ప్రత్యక్ష మెటీరియల్ రూ.6000; ప్రత్యక్ష వేతనాలు రూ.4000; పరోక్ష మెటీరియల్ రూ.2000; పరోక్ష వేతనాలు రూ.1000; ఇతర పరోక్ష ఖర్చులు రూ.500; పరిపాలనా ఖర్చులు రూ.800 అయితే వర్క్స్ లేదా ఫ్యాక్టరీ వ్యయం ఎంత?
ఎ) రూ.6500 బి) రూ.5700 సి) రూ.7300 డి) ఏదీకాదు
జ: (ఎ)
33. ఒక సంస్థ ఉత్పత్తి చేసిన వస్తువుల మొత్తం వ్యయం రూ.1,00,000. అమ్మకాలపై 20% లాభం వస్తే లాభం ఎంత?
ఎ) రూ.20,000 బి) రూ.30,000 సి) రూ.25,000 డి) రూ.33,000
జ: (సి)
34. మెటీరియల్ ప్రారంభ నిల్వ రూ.80,000; మెటీరియల్ కొనుగోలు రూ.1,20,000; ప్రత్యక్ష వేతనాలు రూ.50,000; మెటీరియల్ ముగింపు నిల్వ రూ.30,000 అయితే వినియోగించిన మెటీరియల్ విలువ ఎంత?
ఎ) రూ.2,20,000 బి) రూ.1,70,000 సి) రూ.1,20,000 డి) ఏదీకాదు
జ: (బి)
35. బిన్ కార్డును ఎవరు నిర్వహిస్తారు?
ఎ) స్టోర్ కీపర్ బి) కొనుగోలు విభాగం సి) కాస్టింగ్ విభాగం డి) అన్నీ
జ: (ఎ)
36. వార్షిక మెటీరియల్ వినియోగం రూ.7,00,000; ఆర్డర్ చేయడానికి అయ్యే వ్యయం రూ.10; వార్షిక నిల్వ, నిర్వహణ వ్యయం - ఇన్వెంటరీ విలువలపై 20% అయితే ఈవోక్యూ విలువ ఎంత?
ఎ) రూ.8000 బి) రూ.9367 సి) రూ.8367 డి) రూ.8600
జ: (సి)
37. మెటీరియల్స్‌ను వాటి విలువల ఆధారంగా వర్గీకరించి నియంత్రించే టెక్నిక్‌ను ABC విశ్లేషణ అంటారు. ABC ని విస్తరించండి.
ఎ) Always Bad Control బి) Always Better Control సి) Always Best Control డి) పైవన్నీ
జ: (బి)
38. కింది ఏ పద్ధతిలో ముగింపు సరకు విలువ వర్తమాన ధరలకు సమీపంగా ఉంటుంది?
ఎ) FIFO బి) LIFO సి) సగటు వ్యయ డి) ఏదీకాదు
జ: (ఎ)
39. కిందివాటిలో ఏ మెటీరియల్ జారీ పద్ధతి ధరలు పెరుగుతున్నప్పుడు ఉపయోగకరంగా ఉంటుంది?
ఎ) FIFO బి) LIFO సి) భారిత సగటు ధర పద్ధతి డి) ఏదీకాదు
జ: (బి)
40. మెర్రిక్ భేదాత్మక పీస్ రేటు పద్ధతిలో కార్మికుడి పని సామర్థ్యం ఎంతమేరకు ఉంటే పీస్ రేటుపై 110% మేరకు వేతనం చెల్లిస్తారు
ఎ) 83% వరకు బి) 83% నుంచి 100% వరకు సి) 100% మించి డి) ఏదీకాదు
జ: (బి)
41. హాల్సే అనే అమెరికన్ ఇంజినీర్ మొదటిసారిగా 'హాల్సే ప్రీమియం పథకం'ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు?
ఎ) 1898 బి) 1991 సి) 1891 డి) 1895
జ: (సి)
42. జేమ్స్ రోవన్ ఏ సంవత్సరంలో రోవన్ పథకాన్ని ప్రవేశపెట్టాడు?
ఎ) 1891 బి) 1898 సి) 1895 డి) 1896
జ: (బి)
43. ఇటుకల తయారీకి సంబంధించి కిందివాటిలో ఏ కాస్టింగ్ పద్ధతి అనువుగా ఉంటుంది?
ఎ) యూనిట్ బి) ప్రాసెస్ సి) బహుళ డి) బ్యాచ్
జ: (ఎ)
44. జాబ్ కాస్టింగ్ పద్ధతిని కింది ఏ పరిశ్రమలో ఉపయోగిస్తారు?
ఎ) యంత్రపు పనిముట్ల తయారీ బి) గృహాల్లో ఎలక్ట్రిక్ వైరింగ్ సి) ప్రింటింగ్ డి) పైవన్నీ
జ: (డి)
45. ధ్రువీకరించిన పని విలువ కాంట్రాక్టు మొత్తంలో 1/4వ వంతు కంటే ఎక్కువగా ఉండి 1/2వ వంతు కంటే తక్కువగా ఉన్నప్పుడు లాభనష్టాల ఖాతాకు ఎంత లాభం మళ్లించాలి?
ఎ) భావిత లాభంలో 2/3 వంతు బి) భావిత లాభంలో 1/3 వంతు సి) భావిత లాభంలో 1/4 వంతు డి) ఏదీకాదు
జ: (బి)
46. కాంట్రాక్ట్ కాస్టింగ్‌ను మరోవిధంగా ఏమని పిలుస్తారు?
ఎ) టెర్మినల్ కాస్టింగ్ బి) మార్జినల్ కాస్టింగ్ సి) బహుళ కాస్టింగ్ డి) యూనిట్ కాస్టింగ్
జ: (ఎ)
47. కాగితం తయారీ పరిశ్రమలో ఉపయోగించే కాస్టింగ్ ఏది?
ఎ) బహుళ బి) కాంట్రాక్ట్ సి) ప్రాసెస్ డి) జాబ్
జ: (ఎ)
48. ఆపరేటింగ్ కాస్టింగ్‌ను కింది ఏ సంస్థలో ఉపయోగిస్తారు?
ఎ) రవాణా బి) పంచదార పరిశ్రమ సి) ప్రింటింగ్ డి) ఇటుకల తయారీ
జ: (ఎ)
49. బిస్కట్ల తయారీలో ఉపయోగించే కాస్టింగ్ పద్ధతి ఏది?
ఎ) జాబ్ బి) బ్యాచ్ సి) ప్రాసెస్ డి) కాంట్రాక్ట్
జ: (బి)
50. 'స్థిర వ్యయాలు, చర వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని పాటిస్తూ వివిధ ఉత్పత్తి పరిమాణాల్లో అయ్యే చర వ్యయాల మొత్తాలను నిర్ణయించి, లాభం ఏ విధంగా ప్రభావితమయ్యేది చూపే విధానాన్ని' ఇలా అంటారు?
ఎ) మార్జినల్ కాస్టింగ్ బి) ప్రామాణిక కాస్టింగ్ సి) ప్రాసెస్ కాస్టింగ్ డి) జాబ్ కాస్టింగ్
జ: (ఎ)
No comments:
Post a Comment