రిటైల్ జాబ్ ఇంటర్వ్యూ..సూటైతే సెట్ కావచ్చు
భారత దేశంలో అత్యంత వేగంగా దూసుకువెళుతున్న వాటిలో రిటైల్ రంగం ఒకటి. జిడిపిలో దీని వాటా పదిశాతం. ఉద్యోగుల్ల్లో ఎనిమిది శాతం మంది ఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. రిటైల్ స్పేస్‌కు సంబంధించి ప్రపంచంలోనే అయిదో స్థానంలో భారత్ ఉంది. దేశ ప్రజలు ప్రధానంగా మధ్యతరగతి వినియోగ ధోరణిలో వచ్చిన మార్పులు ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నాయన్నది మార్కెట్ పరిశోధకుల విశ్లేషణ. ఇదంతా సరే, ఏటా పన్నెండు శాతం ఎదుగుదలను ఊహిస్తున్న రిటైల్ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటే ఏమి చేయాలన్నది ముఖ్యమైన ప్రశ్న. సంబంధిత ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలన్నది మరో అంశం. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణుల సూచనలు చూద్దాం...
ప్ర: రిటైల్ రంగంలో గతంలో పని చేశారా?
జ: ఉదాహరణకు రిటైల్ రంగంలో పని చేయలేదనే అనుకుందాం. అది నేరుగా ఉత్పత్తి కానక్కర్లేదు. విషయం ఆసాంతం వివరించి ఎదుటి వ్యక్తి లేదంటే స్నేహి తుడిని సమాధానపర్చడం కావచ్చు. అదీ కాదనుకుంటే పేరెంట్స్‌ను ఒప్పించడం కావచ్చు. ఆ రెంటిలో ఏదైనా అమ్మకం కిందే పరిగణించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఒప్పించే కళ మీకు ఉంది. అదే మీ సామర్థ్యం. ఇక్కడ ఎలా సమాధానం చెప్పాలంటే.... ఇంతవరకు అనుభవం లేదు. అయితే నా ఆసక్తులు ఈ రంగంలో పనిచేసేందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నాను. వ్యక్తుల్ని కలవడం నాకు సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంపై అప్‌టు డేట్‌గా ఉంటాను. మా చుట్టాలు, మిత్రులు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు నన్ను సంప్రదిస్తుంటారు. ఇలాంటి సమాధానాలతో ఆకట్టుకోవచ్చు.
ప్ర: వారానికి కనీసం పదహారు గంటలపైగా పని చేయ గలరా?
జ: సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను కాలేజీ చదువుతూ ఉద్యోగం కోసం వచ్చేవారిని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులో నిజాయతీ కనిపించాలి. మీ వెసులుబాటుని అనుసరించి సమాధానం చెప్ప గలగాలి. మొన్నటి వేసవి కాలంలో పూర్తి స్థాయిలో పని చేశాను. మళ్ళీ సెమిస్టర్ ఆరంభమైన తరవాత పార్ట్‌టైమ్ షెడ్యూల్ ఎంచుకున్నాను. కాలేజీ నాకు చాలా ముఖ్యం. అలాగే కమిట్‌మెంట్ విషయంలో సీరియ్‌సగానే ఉంటాను. అంగీకరించిన పనిని పూర్తి చేసే ఇంటికి వెళతాను.
ప్ర: షిఫ్టుల్లో పని చేయగలరా? లేట్ నైట్స్ ఉండగలరా? ఉదయాన్నే డ్యూటీకి రాగలరా? వీకెండ్స్ పనిచేయ మంటే కుదురుతుందా?
జ: పై ప్రశ్నమాదిరిగానే ఇది కూడా ఉంటుంది. పని విషయంలో మీరెంత సీరియస్ అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న అడగడంలోని ఉద్దేశం. మీలో నిజాయతీపాళ్ళు ఎంతో కనుగొనడం మరో లక్ష్యం. షిఫ్టుల్లో పని చేయడం నాకు సమస్య కాదు. చాలా దూరం నుంచి నేను ఇక్కడికి రావాలి. అందువల్ల నేను నైట్ డ్యూటీలను ప్రిఫర్ చేస్తాను. ఉదయమే రావడం కొద్దిగా కష్టమే. అవసరమైతే వీకెండ్స్‌లో పని చేయడానికి అభ్యంతరం లేదు అని చెప్పవచ్చు.
ప్ర: మిమ్మల్ని మేం ఎందుకు తీసుకోవాలి?
జ: ఇది అన్ని జాబ్‌లకూ వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్నకు చాలా వరకు సమాధానం చెప్పారు. బ్రాండింగ్, ఫ్యాషన్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. ఇంకా లోతుగా ఈ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వ్యక్తిని. అమ్మకాలు, కస్టమర్ సర్వీ్‌సలో మరింత నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఏ రకంగా చూసుకున్నప్పటికీ మీకు నేను సూటవుతాను. ఇలా ప్రశ్నలను కొద్దిగా ఊహించుకుని వెళితే, నిక్కచ్చిగా, నిర్భయంగా సమాధానాలు చెప్పే వీలు ఉంటుంది.
ప్ర: మా రిటైల్ సంస్థలో ఎందుకు పని చేయాలని అనుకుంటున్నావు?
జ: రిటైల్ అనే కాదు, ఏ కంపెనీ నుంచైనా ఇటువంటి ప్రశ్న ఎదుర్కోవాల్సి రావచ్చు. ‘వై’ అన్నదో సర్వసాధారణమైన ప్రశ్న. సమాధానానికి ముందు అక్కడి మన ఉద్యోగ స్వరూప స్వభావాలను తెలుసుకుని మరీ జవాబు చెప్పాలి. బ్రాండ్ అండ్ డిజైనింగ్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. నేను నమ్మిన కంపెనీలో పని చేయాలంటే నాకు చాలా ఇష్టం.
లేదంటే ఇంకోలానూ సమాధానం చెప్పవచ్చు. నాకు రిటైల్‌లో పని చేయాలని ఉంది. జనాలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. వారితో కలసి పని చేయాలంటే నాకు ఆసక్తి. అందువల్లే మీ బిజినెస్ లో ఉద్యోగిగా భాగస్వామిని కావాలని అనుకుంటున్నాను.
No comments:
Post a Comment